అన్నాడీఎంకేలో మరో తిరుగుబాటు

15 Feb, 2017 14:31 IST|Sakshi
అన్నాడీఎంకేలో మరో తిరుగుబాటు
శశికళ వర్గానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. శశికళ పోకడలు, ఆమె చేస్తున్న నియామకాలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులు గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పార్టీ వ్యవస్థాపక ఆర్గనైజింగ్ సెక్రటరీ నెళ్లై కురుప్పస్వామి పాండియన్ తన పదవికి రాజీనామా చేశారు. 
 
పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను నియమించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అన్నాడీఎంకే ఇప్పుడు శశికళ కుటుంబ సభ్యుల పార్టీగా మారిపోయిందని పాండియన్ మండిపడ్డారు. ఒకప్పుడు అమ్మ సస్పెండ్ చేసినవారిని ఇప్పుడు మళ్లీ పార్టీలోకి తీసుకోవడం సరికాదని ఆయన చెప్పారు.