నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

15 Feb, 2017 15:59 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ లాభాల్లో ఉన్నప్పటికీ ఆరంభం నుంచీ అప్రమత్తంగా మదుపర్లు మిడ్‌ సషన్‌  తరువాత అమ్మకాలపై మొగ్గు  చూపారు. దీంతో సెన్సెక్స్‌ ఒకదశలో 200 పాయిం‍ట్లకు పైగాకోల్పోయింది. చివరికి 184పాయింట్లు క్షీణించి 28, 155 వద్ద,  నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 8725వద్ద ముగిసింది. ఆటో, రియల్‌ ఎస్టేట్‌, ఫార్మ, సెక్టార్‌ లో భారీ అమ్మకాల ధోరణి సాగింది. 

ప్రధానంగా  దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్‌ ఫలితాల నేపథ్యంలో భారీగా నష‍్టపోయింది.  దాదాపు10శాతానికిపైగా క్షీణించింది. గత మూడునెలల కాలంలో  బిగ్గెస్ట్‌ ఫాల్‌  నమోదు చేయడంతో నిఫ్టీ రెండువారాల కనిష్టాన్ని నమోదు చేసింది. మిడ్‌ క్యాప్‌, బ్యాంక్‌నిఫ్టీ  అండర్‌ పెర్‌ఫాం  చేసింది.  సన్‌ ఫార్మా, డీఎల్‌ఎఫ్‌, స్పైస్‌ జెట్‌ కూడా బాగా నష్టపోయాయి.
 
 

>
మరిన్ని వార్తలు