అమ్మకాల ఒత్తిడిలో స్టాక్మార్కెట్లు

5 Oct, 2016 10:33 IST|Sakshi
అమ్మకాల ఒత్తిడిలో స్టాక్మార్కెట్లు
ముంబై:   ఆర్ బీఐ వడ్డీ రేటు కోత నిర్ణయంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.  రెపో రేటును పావు శాతం తగ్గించడంతో జోష్ గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్ ప్రస్తుతం48 పాయింట్ల నష్టంతో 28,286 దగ్గర, నిఫ్టి 19పాయింట్ల నష్టంతో 8749 దగ్గర ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8,800 స్థాయి కిందికి దిగజారింది.  ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు మన మార్కెట్  సెంటిమెంటు  ప్రభావితం చేస్తోందని ఎనలిస్టుల అంచనా. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ సెక్టార్ నష్టాల్లో ఉంది.  ఈ సూచీల్లో మదుపర్ల  అమ్మకాల ఒత్తిడి  కొనసాగుతుండగా,  మెటల్, రియల్టీ, పవర్, బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి.  
 
అటు డాలర్ మారకపు విలువలో దేశీ కరెన్సీ 13 పైసల నష్టంతో 66.57 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా. పుత్తడి 29,991  వద్ద ఉంది.
 
>
మరిన్ని వార్తలు