లాభనష్టాల ఊగిసలాటలో మార్కెట్లు

17 Aug, 2016 10:15 IST|Sakshi

ముంబై : నష్టాల్లో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్మార్కెట్లు, ప్రస్తుతం లాభనష్టాలకు మధ్య ఊగిసలాటలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 11.70 పాయింట్ల స్వల్ప లాభంతో 28,076 వద్ద, నిఫ్టీ 3.45 పాయింట్ల నష్టంతో 8,639 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని ఐటీ, హెల్త్ కేర్ స్టాక్స్లో నెలకొన్న బలహీనత కారణంగా మార్కెట్లు నష్టాల్లో ఎంట్రీ ఇచ్చాయి. నేడు రాత్రి విడుదల కానున్న ఫెడ్ జూలై పాలసీ మీటింగ్పై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. తాజాగా విడుదలైన మెరుగైన జాబ్స్ డేటా అనంతరం ఫెడ్ రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లపై ఏవిధమైన సంకేతాలు ఇవ్వనుందోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్టాక్మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హీరో మోటాకార్పొ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ లాభాలు పండిస్తుండగా.. టీసీఎస్, సన్ ఫార్మా, లుపిన్, సిప్లా, ఎస్బీఐ నష్టాలను గడిస్తున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు కూడా నష్టాల్లోనే పయనిస్తూ.. నిఫ్టీలో టాప్ లూజర్గా కొనసాగుతోంది. ఇన్ఫీ స్టాక్ 1.27 శాతం పడిపోయింది.
అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66.76గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 241 రూపాయల లాభంతో రూ.31,460గా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు