స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్

1 Nov, 2016 17:16 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్  స్వల్ప నష్టాలతో, నిఫ్టీ ఫ్లాట్ గా ముగిసింది.  ఆరంభంలో లాభాలను ఆర్జించినా రోజంతా ఒడిదుడుకుల మధ్యసాగిన సెన్సెక్స్‌ 54 పాయింట్లు  క్షీణించి 27,877 వద్ద  నిఫ్టీ  8,626 వద్ద  స్థిరపడ్డాయి.   ప్రధానంగా మెటల్‌ సెక్టార్  భారీగా లాభపడింది.  ఆటో  బలపడగా, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌   పేలవగా  ట్రేడ్ అయ్యాయి.
ముఖ్యంగా .చైనా ఆర్థిక గణాంకాలు పుంజుకున్న వార్తలతో మెటల్‌ షేర్లు దూకుడును ప్రదర్శించాయి.  ఎంవోఐఎల్‌ దాదాపు 11 శాతం దూసుకెళ్లగా, వేదాంతా, ఒరిస్సా మైనింగ్‌ దాదాపు 9 శాతం  లాభపడ్డాయి. ఇదే  హిందుస్తాన్‌ జింక్‌, ఎన్‌ఎండీసీ, ఏపీఎల్‌ అపోలో, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, భూషణ్‌ స్టీల్‌, కోల్‌ ఇండియా, సెయిల్‌, నాల్కో పయనించాయి.  ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫ్రాటెల్‌, భెల్‌  లాభపడగా, యాక్సిస్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌, సిప్లా, జీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, యస్‌బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌  నష్టపోయాయి.
అటు కరెన్సీమార్కెట్  లో రూపాయి  స్వల్ప నష్టాల్లో ఉండగా పుత్తడి మెరుపులు  మెరిపిస్తోంది. 270 రూపాయల లాభంతో పది గ్రా. పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో 30,220 వద్ద ఉవంది.

 

>
మరిన్ని వార్తలు