వారాంతంలో మార్కెట్ల ఫ్లాట్‌ ముగింపు

19 May, 2017 17:29 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.  జీఎస్‌టీ  జోష్‌తో ఆరంభం‍లో ఉత్సాహంగా మొదలై, రికార్డ్‌ స్తాయిని నమోదు చేశాయి. అనంతరం  భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 30 పాయింట్లు పెరిగి 30,465 వద్ద నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 9,428 వద్ద స్థిరపడింది. మిడ్‌సెషన్‌లో భారీ అమ్మకాల ధోరణి నెలకొన్నా, చివర్లో కోలుకున్నాయి. అయితే వారాంతంలో  అప్రమత్తంగా ముగిసింది.

ముఖ్యంగా  జీఎస్‌టీ రేట్లలో నిత్యావసరాలపై 5 శాతానికే పన్ను కట్టడి చేయడంతో ఎఫ్ఎంసీజీ కౌంటర్లు జోరందుకున్నాయి. అలాగే ఫలితాలనేపథ్యంలో ఎస్‌బీఐ  టాప్‌ విన్నర్‌గా నిలిచింది.   ఐటీ, ఆటో ఇండెక్స్‌  నష్టపోయింది. ఐటీసీ, హెచ్‌యుఎల్‌, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, టాటా మోటా్ర్స్‌, బీవోబీ  లాభాల్లో ముగియగా, ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఐషర్‌, హిందాల్కో, టీసీఎస్‌,  ఐబీ హౌసింగ్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్, మారుతీ, బాష్‌ నష్టపోయాయి.

అటు డాలర్‌ మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. 0.19 పైసలుపతనమై రూ. 64.65 వద్ద ఉంది.  ఎంసీఎక్స్‌ మార్కెట్లో  బంగారం ధరలు  స్వల్పంగా క్షీణించాయి.  పది గ్రా. రూ. 55 తగ్గి, రూ. 28,655 వద్ద వుంది.
 

>
మరిన్ని వార్తలు