బ్యాంకింగ్ దెబ్బతో మార్కెట్లు ఢమాల్

26 Oct, 2016 16:14 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి నష్టాల్లో కొనసాగిన  సెన్సెక్స్ చివరికి 265పాయింట్ల నష్టంతో  26,826 వద్ద,  నిఫ్టీ 82  పాయింట్ల నష్టంతో 8609 వద్ద ముగిసింది.  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో మిడ్‌ సెషన్‌ నుంచి పెరిగిన భారీ అమ్మకాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు  ఒక దశలో  332 పాయింట్లకు పైగా పతనమయ్యాయి.  నష్టాల్లో ఉన్న మార్కెట్లకు యూరప్‌ బలహీన సంకేతాలతో మరింత కుదేలైంది. అన్ని రంగాలూ నష్టపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లోని అమ్మకాలు మార్కెట్ను ప్రభావితం చేసాయి.  దీనికితోడు  మెటల్స్‌, ఫార్మా, ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాలు కూడా  క్షీణించాయి.  ఫలితాల ప్రకటనతో యాక్సిస్‌ 8.3 శాతం కుప్పకూలగా, టాటా సంచలనంతో వరుసగా రెండో రోజు కూడా టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టాటా పవర్, టీసీఎస్  లకు నష్టాలు తప్పలేదు.  ఇదేబాటలో   ఎస్ బీఐ,  ఐసీఐసీఐ,  ఇన్ఫ్రాటెల్‌, అరబిందో,లుపిన్, సిప్లా  అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ నష్టపోయాయి. మరోవైపు ఐడియా ,  కొటక్‌ బ్యాంక్‌, భారతీ, హీరో మోటో, మారుతీ, హెచ్‌యూఎల్‌  లాభపడ్డాయి.
అటు రూపాయి స్వల్ప లాభంతో మొదలైన 0.01 పైసల నష్టంతో 66.83 వద్ద ఉంది. పసిడి కూడా రూ. 8  నష్టంతో పది గ్రా. రూ.29,934 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు