5 రోజుల ర్యాలీకి బ్రేక్- బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు

16 Oct, 2013 01:50 IST|Sakshi

వరుసగా ఐదురోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. ద్రవ్యోల్బణం ఎగిసిందన్న వార్తలతో వడ్డీ రేట్లు పెరుగుతాయున్న భయూలు మళ్లీ మార్కెట్‌ను ఆవహించారు. దాంతో బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 60 పాయింట్ల క్షీణతతో 20,547 పాయింట్ల వద్ద ముగియుగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల తగ్గుదలతో 6,089పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికాలో షట్‌డౌన్ సంక్షోభం తొలగిపోతుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ సూచీలు కూడా గత ఐదురోజులుగా ర్యాలీ జరిపారుు.
 
 సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా, నిఫ్టీ 200 పాయింట్లపైగా పెరిగాయి. రిలయున్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన ప్రోత్సాహకర ఫలితాలతో వుంగళవారం ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 20,759 పాయింట్ల గరిష్టస్థాయికి చేరగా, నిఫ్టీ 6,156 పాయింట్ల గరిష్టస్థారుుకి పెరిగింది. అయితే రూ. 898 స్థారుుకి పెరిగినదశలో రిలయున్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో కూడా లాభాల స్వీకరణ జరగడంతో ఈ షేరు చివరకు స్వల్ప తగ్గుదలతో రూ. 868 వద్ద ముగిసింది. రిలయున్స్ ఇండస్ట్రీస్‌తోపాటు బ్యాంకింగ్ షేర్లలో గరిష్టస్థాయి వద్ద అవ్ముకాలు జరగడంతో చివరకు స్టాక్ సూచీలు నష్టాలతో ముగిసాయి.
 
 దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లూ తగ్గారుు.  బొగ్గుబ్లాకుల కుంభకోణంపై సీబీఐ దాఖలుచేసిన ఛార్జ్‌షీట్‌లో ఆదిత్యాబిర్లా గ్రూప్ కంపెనీ హిందాల్కోను చేర్చడంతో ట్రేడింగ్ తొలిదశలో ఈ షేరు 5 శాతం క్షీణించి రూ. 105 స్థాయికి పడిపోయింది. అయితే కనిష్టస్థాయిలో జరిగిన షార్ట్ కవరింగ్ ప్రభావంతో వుుగింపులో ఈ షేరు గణనీయుంగా కోలుకుని రూ. 112 వద్ద ముగిసింది. బక్రీద్ పండుగ సందర్భంగా  స్టాక్‌మార్కెట్, ఫారెక్స్, మెటల్,స్టీల్‌తో సహా అన్ని  కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లకు నేడు సెలవు.
 
 నిఫ్టీలో షార్ట్ బిల్డప్... బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ఆఫ్‌లోడింగ్
 ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సెప్టెంబర్ 19 నాటి గరిష్టస్థాయిని తిరిగి చేరిన సవుయుంలో ఆ ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ బిల్డప్ జరిగింది. షార్టింగ్‌ను సూచిస్తూ స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియుం రూ. 21కు పడిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,089 వద్ద వుుగియుగా, ఫ్యూచర్ రూ. 6,120 వద్ద క్లోజరుు్యంది. అక్టోబర్ సెటిల్‌మెంట్ ప్రారంభంనాటి నుంచి ఫ్యూచర్ కాంట్రాక్టు రూ.40-50ప్రీమియుంతో ట్రేడవుతూవస్తోంది. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 9 లక్షల షేర్లు (4.93 శాతం) యూడ్‌కాగా, మొత్తం ఓఐ 1.92 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో సూచీ మరింత తగ్గవచ్చన్న అంచనాలతో ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రరుుంచడాన్ని షార్టింగ్ అని వ్యవహరిస్తారు. నిఫ్టీ షేర్లను పోర్ట్‌ఫోలియోలో కలిగిన విదేశీ ఇన్వెస్టర్లు కూడా వారివద్దనున్న షేరు విలువలను పరిరక్షించుకునేందుకు కూడా నిఫ్టీని షార్ట్ చేస్తారు. ఈ ప్రక్రియును హెడ్జింగ్ అంటారు. మరోవైపు బ్యాంక్ నిఫ్టీలో జోరుగా లాంగ్ ఆఫ్‌లోడింగ్ జరిగింది. ఆరువారాలుగా 8,400 పాయింట్ల స్థాయి నుంచి 30 శాతం ర్యాలీ జరిపిన బ్యాంక్ నిఫ్టీలో లాభాల స్వీకరణ కారణంగా ఈ కాంట్రాక్టు 2.8 శాతం క్షీణతతో 10,400 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఓఐ నుంచి 1.60 లక్షల షేర్లు (8.3 శాతం) కట్‌కావడంతో, మొత్తం ఓఐ 17.64 లక్షల షేర్లకు దిగింది.  గతంలో కొన్న కాంట్రాక్టును తిరిగి  విక్రయించడాన్ని లాంగ్ ఆఫ్‌లోడింగ్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు