నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

26 Sep, 2016 10:12 IST|Sakshi

ముంబై:  అమెరికా సహా ఆసియా, యూరప్‌ మార్కెట్ల బలహీనతతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 150 పాయింట్లు పతనమైన సెన్సెక్స్  ప్రస్తుతం 102పాయింట్ల నష్టంతో 28,565 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 8801 వద్ద ట్రేడవుతున్నాయి. ఎనలిస్టులు అంచనావేసినట్టుగానే సోమవారం  సూచీలు  నష్టాలను నమోదుచేస్తున్నాయి. అలాగే  నిఫ్టీ  8,800 కీలక స్థాయికి దిగువన ట్రేడవుతోంది. బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ రంగాలు నష్టపోతుంగా  ఫార్మా మాత్రమే  లాభాల్లో ఉంది.  మరోవైపు ఆర్‌ఐఎల్‌  లాభాలు  ఈరోజుకూడా కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ, అంబుజా, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, హెచ్డీఎఫ్‌సీ, ఏసీసీ, అదానీ పోర్ట్స్‌, హీరోమోటో, ఇండస్‌ఇండ్‌, గెయిల్‌ నష్టపోతుండగా,  డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, జీ, గ్రాసిమ్‌, టాటా పవర్‌, టాటా స్టీల్‌, అరబిందో  లాభాల్లో ఉన్నాయి.

 

మరిన్ని వార్తలు