మార్కెట్లకు జైట్లీ బూస్ట్‌

24 Mar, 2017 16:14 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  ఆర్థికమంత్రి అరుణ​ జైట్లీ ప్రకటన మంచి బూస్టప్‌ ఇచ్చింది.  దీంతో  వరుసగా రెండో రోజు  లాభపడిన  సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 29,421 వద్ద నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి 9,108 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌తో కలసి మొండిబకాయిల(ఎన్‌పీఏలు) పరిష్కారానికి పటిష్ట విధానాలు రూపొందిస్తున్నామన్న జైట్లీ ప్రకటన  ప్రభుత్వ, ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ కౌంటర్లలో జోష్‌ పెంచింది. దీంతోపాటు ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాలు లాభపడగా, ఐటీ  సె​​‍క్టార్‌ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది.

బీవోబీ, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌  టాప్‌ గెయినర్‌గా నిలిచాయి.  అలాగే గెయిల్‌, బీపీసీఎల్‌, ఐటీసీ, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో, విప్రో  లాభపడ్డాయి.  గ్రాసిమ్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. టెక్‌ మహీంద్రా, జీ, టీసీఎస్‌, అంబుజా, ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐడియా, లుపిన్‌, అదానీ పోర్ట్స్‌ నష్టపోయాయి.

అటు డాలర్‌ మారకంలో రూపాయి 12 పైసలు లాభపడి రూ.65.41 వద్ద ఉంది.  ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో   మాత్రం పుత్తడి ధరల బలహీనత కొనసాగుతోంది. రూ.59 లుక్షీణించి పది గ్రా పుత్తడి 28,741  వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు