లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

28 Mar, 2017 09:49 IST|Sakshi

ముంబై:  స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  ఒబామా హెల్త్‌కేర్‌ రద్దు అంశంలో ట్రంప్‌  ఆందోళనల నుంచి  అమెరికా మార్కెట్లు కోలుకున్నాయి.  అటు ఆసియా మార్కెట్లుకూడా బలపడడంతో సెన్సెక్స్‌ 121 పాయింట్ల లాభంతో రూ.29,358 వద్ద   నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 9089 వద్ద ట్రేడ్‌ అవుతోంది.   దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ​ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుకూడా బ్యాకింగ్‌ షేర్లు లాభపడుతున్నాయి.  క్యాన్సర్‌ మందుకు అనుమతి లభించిందన్న వార్తలతో డిష్‌ మ్యాన్‌ ఫార్మా 20శాతానికిపైగా లాభపడి, అప్పర్‌ సర్క్యూట్‌   అయింది.   యాక్సిస్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌ గా ఉంది.  విదేశీ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిందన్న వార్తలతో భారతి ఇన్‌ ఫ్రా టెల్‌, భారతి ఎయిర్‌టెల్‌ లాభాల్లో ఉన్నాయి.  
అటు  గుడి పడ్వా ను పురస్కరించుకొని కరెన్సీ మార్కెట్లకు  ఈ రోజు  సెలవు.  
 

మరిన్ని వార్తలు