స్వల్పలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

9 Feb, 2017 15:58 IST|Sakshi
ముంబై :  దేశీయ బెంచ్ మార్కు సూచీలు గురువారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 39.78 పాయింట్ల లాభంలో 28329.70వద్ద, నిఫ్టీ 9.35 పాయింట్ల లాభంలో 8778.40 వద్ద క్లోజ్ అయ్యాయి. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహింద్రా, ఐటీసీ, మహింద్రా అండ్ మహింద్రా, భారతీ  ఇన్ఫ్రాటెల్ 1-2 శాతం ర్యాలీ జరిపాయి. టాటా స్టీల్, సిప్లా, పీఎన్బీ, ఎల్ అండ్ టీ 1-3.5 శాతం నష్టాల పాలయ్యాయి.
 
ఈ ఏడాది చివరి వరకు బుల్ కేసు సినారియోతో సెన్సెక్స్ 39వేల మార్కును టచ్ చేస్తుందని గ్లోబల్ బ్రేకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయం వ్యక్తంచేసింది. బేర్ కేసులో అయితే 24వేలుగా ఉంటుందని పేర్కొంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్లో 0.18 పైసలు లాభపడి 67.01 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 31 రూపాయల లాభంతో 29,361గా ఉంది. 
 
మరిన్ని వార్తలు