స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

19 Jan, 2017 16:27 IST|Sakshi
పేలవమైన ట్రేడింగ్ అనంతరం స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50.96 పాయింట్ల లాభంలో 27308.60 వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్ల లాభంలో 8435.10 వద్ద క్లోజ్ అయ్యాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటామోటార్స్, గెయిల్ ఇండియా లాభాలతో పేలవంగా ఉన్న మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. గ్లోబల్ సంకేతాలపై పెట్టుబడిదారులు మరింత క్లారిటీ కోసం వేచిచూస్తున్నారని విశ్లేషకులన్నారు.
 
5.8 శాతం లాభంతో గెయిల్ ఇండియా నిఫ్టీలో టాప్ గెయినర్గా నిలిచింది. బీపీసీఎల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, భారీ ఎయిర్ టెల్ నేటి మార్కెట్లో లాభాలు పండించగా... యాక్సిస్ బ్యాంకు, అరబిందో ఫార్మా, లుపిన్, సన్ ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్ నష్టాలు గడించాయి.
 
ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు నేటి సెషన్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు 1 శాతం పడిపోయాయి. బీఎస్ఈ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 0.4 శాతం, 0.3 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు పడిపోయి 68.18 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు కూడా 200 రూపాయల నష్టంతో 28,591గా నమోదైంది. 
 
మరిన్ని వార్తలు