ఆఖరికి ఫ్లాట్గా ముగింపు

8 Feb, 2017 16:16 IST|Sakshi
ముంబై : ఆర్బీఐ పాలసీ ప్రకటనాంతరం ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి  ఎదుర్కొన్న మార్కెట్లు చివరిలో కొంత తేరుకున్నాయి. 180 పాయింట్ల మేర పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ సెషన్ ముగింపులో కొంత కోలుకుని 45.24 పాయింట్ల నష్టంలో 28,289.92 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా నష్టాల నుంచి తేరుకుని స్వల్పంగా 0.75 పాయింట్ల లాభంలో 8769.05 వద్ద పరిమితమైంది. మార్కెట్లకు షాకిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బుధవారం వెలువరించిన పాలసీ ప్రకనటలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు పేర్కొంది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  పాలసీ ప్రకటనాంతరం బ్యాంకు స్టాక్స్ ఢమాల్ మన్నాయి. కానీ ఆఖరిలో బ్యాంకు స్టాక్స్ కూడా రికవరీ అయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడాలు నష్టాల నుంచి తేరుకుని స్వల్పంగా 0.2 శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్లు మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. 
 
ఆర్బీఐ పాలసీ ప్రకటనతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 186 పాయింట్లు కోల్పోయి 28,149 వద్ద కనిష్టంగా ట్రేడయింది. నిఫ్టీ కూడా కనిష్టంగా 53 పాయింట్ల నష్టంలో 8715 వద్ద నమోదైంది. అనంతరం రికవరీ అయ్యాయి. ''మెజార్టీ సభ్యులు వడ్డీరేట్ల కోతకు ఆశపడ్డారు. కానీ వడ్డీరేట్లలో ఆర్బీఐ కోత పెట్టలేదు. ఇది మార్కెట్లకు పాజిటివ్నే. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం రూపాయి విలువను స్థిరంగా ఉంచుతుంది. ఒకవేళ రేటు కోత పెట్టుంటే రూపాయి విలువ పడిపోయేది దీంతో అవుట్ఫ్లోస్ పెరిగేవ'' అని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. మార్కెట్లు రికవరీకి కారణమిదేనని పేర్కొన్నారు.  అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు లాభపడి 67.30 వద్ద ముగిసింది. 
 
 
మరిన్ని వార్తలు