2017 ఫస్ట్ ట్రేడింగ్ డే: నష్టాల్లో ముగింపు

2 Jan, 2017 16:21 IST|Sakshi
ఏడాది ప్రారంభ ట్రేడింగ్లో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 31.01 పాయింట్ల నష్టంతో 26,595 వద్ద, నిఫ్టీ 6.30 పాయింట్ల నష్టంతో 8,179 వద్ద ముగిసింది. నష్టాల్లో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాటలో నడిచి, ఆఖరికి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. మధ్యాహ్నం సెషన్లో ఆటో, ఫార్మా స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ తన కీలకమార్కు 8200ను పునరుద్ధరించుకుంది. కానీ ముగింపుకు వచ్చే సరికి మళ్లీ 8,179 పాయింట్లకు పడిపోయింది.
 
2017 ప్రారంభం రోజున మార్కెట్లు బలహీనంగా ముగిసినప్పటికీ, మిడ్క్యాప్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లు మార్కెట్లో మంచి ప్రదర్శనను కనబరిచాయి. ఈ రెండు సూచీలు 1.2 శాతం పైకి ఎగిశాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు సెషన్ ప్రారంభంలో కొంత రికవరీ అయి, ఆఖరికి 2 శాతం లాభాలను ఆర్జించాయి. ఆటో షేర్లలో మహింద్రా అండ్ మహింద్రా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతీసుజుకీ 3.8 శాతం మేర లాభాలు పొందాయి. రియాల్టీ స్టాక్స్ కూడా 4 శాతం లాభాల్లో ముగిశాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలు 0.17 పాయింట్లు పడిపోయి 68.10గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం సైతం 70 రూపాయల లాభంతో 27,515గా ట్రేడ్ అయింది. 
మరిన్ని వార్తలు