ఆర్బీఐ పాలసీ: లాభాల్లో మార్కెట్లు

12 Dec, 2016 14:48 IST|Sakshi
ఆర్బీఐ పాలసీ బుధవారం విడుదల కానున్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పాజిటివ్ నోట్గా ముగిసినా.. 8150 లెవల్కు దిగువకే నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 43.66 పాయింట్ల లాభంలో 26392.76వద్ద, నిఫ్టీ 14.40 పాయింట్ల వద్ద 8143.15వద్ద క్లోజ్ అయ్యాయి.  8000వేల దిగువకు పడిపోయిన మార్కెట్లు రెపో రేటు కోత నేపథ్యంలో రికవరీ చెందుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఆర్బీఐ కామెంటరీపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ రేటు 50 పాయింట్ల కోత విధిస్తే మార్కెట్లు పెంపు కొనసాగుతుందని చెప్పారు.
 
ఇంట్రాడేలో సగం శాతం ఎగిసిన నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. ఎస్బీఐ 1 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.17 శాతం పెరుగగా.. హెచ్డీఎఫ్సీ 0.2 శాతం, యాక్సిస్ బ్యాంకు 1 శాతం పడిపోయాయి. ఆటో ఇండెక్స్ కూడా తన లాభాలను కోల్పోయింది. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, హిరో మోటార్ కార్పొ, మహింద్రా అండ్ మహింద్రాలు 0.3-1.2 శాతం పడిపోయాయి. టాటా మోటార్స్ మాత్రం 0.4 శాతం ఎగిసింది.  
 
>
మరిన్ని వార్తలు