ఫ్లాట్ గా మార్కెట్ల ప్రారంభం

23 Jan, 2017 09:31 IST|Sakshi



ముంబై: స్టాక్ మార్కెట్లు స్వల్ప  నష్టాలతో ప్రారంభమైనాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్  ప్రమాణ స్వీకారం తరువాత  మొదలైన తొలి సెషన్ లో దేశీయ మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. సెన్సెక్స్44  పాయింట్ల నష్టంతో 26, 990 వద్ద నిప్టీ 8  పాయింట్ల నష్టంతో 8345  వద్ద ఉన్నాయి.  సెన్సెక్స్,నిఫ్టీ  సాంకేతికంగా కీలకమైన స్థాయిలకు దిగువన ట్రేడ్ అవుతున్నాయి.  అన్ని రంగాల షేర్లు రెడ్ లో ఉన్నాయి. ముఖంగా ఐటీ  , బ్యాంకింగ్ , హెల్త్ కేర్  సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.  కాగా ఫలితాల అంచనాలతో అల్ట్రాటెక్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. యాక్సిస్ బ్యాంక్,  ఐసిఐసిఐ టాప్ లూజర్ గా  ఉన్నాయి.

అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ మా ఉద్యోగాలు మాకే అన్న వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే బామా హెల్త్‌కేర్‌ పథకాన్ని రద్దు చేయడంతోపాటు, హెచ్‌1బీ వీసాలపై కొత్త బిల్లు కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఫార్మా రంగాలు 1 శాతం  నష్టపోయాయి.
 

మరిన్ని వార్తలు