భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

27 Dec, 2016 16:33 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభంనుం నుంచీ సానుకూలంగా ట్రేడ్ అయిన మార్కెట్లు  సెన్సెక్స్‌ 406 పాయింట్లు దూసుకెళ్లి 26,213 వద్ద, నిఫ్టీ 125 పాయింట్ల హైజంప్‌తో 8,033 వద్దముగిసింది. ముఖ్యంగా  మిడ్ సెషన్‌  తర్వాత ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు  దిగడం, కనిష్టస్థాయిలో షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకుదిగడం లాంటి అంశాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. అలాగే రేపటితో డిసెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లకు ప్రోత్సాహం లభించిందని విశ్లేషకులు పేర్కొన్నారు.  గత కొన్ని సెషన్లగా  అమ్మకాల ఒ త్తిడి ఎదుర్కొన్న మార్కెట్లు   లాంట్ టర్మ్  కాపిటల్ లాభాలపై  పన్నులుండవన్న ఆర్థికమంత్రి  అరుణ్ జైట్లీ భరోసాతో  బౌన్స్ బ్యాక్  అయ్యాయని వే టు వెల్త్   సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అలోక్ రంజన్ తెలిపారు.
ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్‌ రంగాలు లాభపడ్డాయి.  బాష్‌, ఐటీసీ 4.5 శాతం  స్థాయిలో జంప్‌చేయగా, టాటా స్టీల్‌, అరబిందో, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, లుపిన్‌, యస్‌బ్యాంక్‌, ఐషర్‌ 3.3-2.4 శాతం  మధ్య దూసుకెళ్లాయి. గెయిల్‌,  గ్రాసిమ్‌స్ స్వల్ప నష్టాలతో ముగిశాయి.   మిడక్ క్యాప్, స్మాల్ కాప్ షేర్లలో  కూడా కొనుగోళ్ల ధోరణి కనిపించింది.
 అటు డాలర్ మారకపు రేటులు రూపాయి 29 పైసలు నష్టపోయి రూ. 68.03 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి ధర ఈరోజుబాగా పుంజుకుంది.  పది గ్రా.  రూ. 246 ఎగిసి, రూ.27,283 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు