లాభాల్లో ముగిసిన మార్కెట్లు

12 Dec, 2016 14:52 IST|Sakshi
ఆటో, మెటల్, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోలుతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పెరుగగా.. నిఫ్టీ 8100 మార్కును పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 115 పాయింట్ల లాభంతో 26,346 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 8,127వద్ద ముగిసింది. టాప్ నిఫ్టీ గెయినర్గా లుపిన్ నిలిచింది. ఈ కంపెనీ షేరు 3.4 శాతం ఎగిసి, రూ.1,539గా ట్రేడ్ అయింది. అదేవిధంగా ఏషియన్ పేయింట్స్, బోస్చ్, మహింద్రా అండ్ మహింద్రా, భారతీ ఎయిర్టెల్, సుజుకీ, హీరో మోటార్కార్పొ, బజాజ్ ఆటో, ఐటీసీ, టాటా మోటార్స్ నేటి మార్కెట్లో లాభాలు పండించాయి.
 
మరోవైపు టెక్ మహింద్రా, టీసీఎస్, హెచ్డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్, ఐడియా సెల్యులార్ నష్టాల్లో ముగిశాయి. కొన్ని షేర్లలో నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లో ముగిసినట్టు విశ్లేషకులు చెప్పారు. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం జంప్ అయ్యాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 0.03 పైసలు క్షీణించి, 68.25గా ఉంది. 
 
మరిన్ని వార్తలు