పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

30 Dec, 2016 10:31 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు  శుక్రవారం లాభాలతోప్రారంభమయ్యాయి. జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ నేడు మొదలుకావడంతో అటు ట్రేడర్లు. దేశీ ఫండ్స్‌ లో భారీ పెట్టుబడులు,  మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో  సానుకూలంగా కదులుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్  185 పాయింట్ల లాభంతో  26,661వద్ద స్థిరంగా ఉంది.  నిఫ్టీ 53 పాయింట్ల లాభపడి   దీంతో నిఫ్టీ 8150   స్థాయికి ఎగువన ట్రేడ్అవుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్, ఆటో  రంగ షేర్లుగ్రీన్ లో ఉన్నాయి.  టాటా పవర్‌, అరబిందో, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, ఐసీఐసీఐ, అంబుజా, ఐషర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్ బ్యాంక్‌, మారుతీ  లాభాల్లో బీపీసీఎల్‌, భారతీ, ఇన్ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా  స్వల్ప నస్టాల్లో కొనసాగుతున్నాయి.


అటు రూపాయి ఈరోజు బాగా బలపడింది. 14పైసలు పుంజుకుని రూ.67.96  వద్ద ఉంది. బంగారం ధరలు  కూడా సానుకూలంగా కదులుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి 10 గ్రా. 35  రూపాయలు ఎగిసి 27,597 వద్ద  ఉంది.
 

మరిన్ని వార్తలు