భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

13 Oct, 2016 11:00 IST|Sakshi
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, క్యూ2   ఫలితాల అంచనాల నేపథ్యంలో  నష్టాలతో మొదలై ఆ ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి.  సెన్సెక్స్ 256 పాయింట్ల నష్టంతో 27, 825 వద్ద.. నిఫ్టీ 80  పాయింట్ల నష్టంతో  8,628 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా  ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ, ఐటీ సెక్టార్లు పాజిటివ్ గా ఉండగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ఎక్కువగా నష్టాల్లో ఉన్నాయి. మెటల్స్, కేపిటల్ గూడ్స్ రంగాల్లోని షేర్లకు కూడా అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. నిన్న ఫలితాలను ఇండస్ ఇండ్ బ్యాంక్ స్వల్ప లాభాలతో ఉండగా,  క్యూ2   ఫలితాలు పేలవంగా ఉండనున్నాయనే అంచనాలతో  ఐటీ మేజర్  టీసీఎస్ నేల చూపులు చూస్తోంది. ఓఎన్జీసీ, సిప్లా, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, గెయిల్ టాప్ గెయినర్స్ గా , భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్ డీవీఆర్, జీ ఎంటర్టెయిన్మెంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
అటు డాలర్ తో  పోలిస్తే రూపాయి 0.25 పైసల నష్టంతో66.79 దగ్గర, ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి పది గ్రాములు154 రూపాయల లాభంతో రూ.29,805 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు