నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

5 Oct, 2016 16:35 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  నష్టాలతో ముగిశాయి.  ఆరంభంలో ఆశ చూపించిన  సూచీలు రోజు మొత్తం బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. చివరికి  మూడు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ సెన్సెక్స్  114 పాయింట్లు నష్టంతో  28,221 వద్ద నిఫ్టీ  25  పాయింట్ల  నష్టంతో 8,743. వద్ద  ముగిశాయి.  ముఖ్యంగా  బ్యాంకింగ్,ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, హెల్త్ కేర్ సెక్టార్లు భారీగా నష్టపోయాయి.  ఈ రంగాల షేర్లో మదుపర్లు   ప్రాఫిట్ బుకింగ్ కు  దిగారు.
అలాగే ఇటీవల మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్న చిన్న షేర్లు  మాత్రం మరోసారి భారీ లాభాలను ఆర్జించడం విశేషం.  రియల్టీ, మెటల్స్‌, మీడియా, ఆటో రంగాలు  లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, యాక్సిస్‌, ఐడియా, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఆటో, కొటక్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటో, సిప్లా, భెల్  నష్టపోగా,  టాటా మోటార్స్, బీపీసీఎల్‌, అల్ర్టాటెక్, ఐషర్‌, హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌  లాభపడ్డాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనత కొనసాగుతోంది.0.08 పైసల నష్టంతో 66.54దగ్గర ఉండగా, ఎంసీఎక్స్ మార్కెట్లో  పుత్తడి ధరలు స్వల్పంగా లాభపడ్డాయి.  పదిగ్రా.పసిడి రూ. 9 లాభంతో రూ. 30,000దగ్గర స్థిరంగా ఉంది. ఉదయం 30 వేలదిగువన చేరిన ధరలు అనంతరం కీలక మద్దతు  స్థాయికి పైన  నిలదొక్కుకునే ప్రయత్నంలోఉంది.  
 

>
మరిన్ని వార్తలు