బలపడిన రూపాయి, సెన్సెక్స్ జెట్ స్పీడ్!

19 Sep, 2013 16:13 IST|Sakshi
బలపడిన రూపాయి, సెన్సెక్స్ జెట్ స్పీడ్!
ఉద్దీపన కార్యక్రమంపై యూఎస్ ఫెడరల్ రిజర్వు అనూహ్యమైన నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ప్రభావం,  రూపాయి నెలరోజుల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్న వార్తల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం జెట్ స్పీట్ తో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లు ముందుండి సూచీలను పరిగెత్తించాయి. 
 
గురువారం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 20354 పాయింట్ల వద్ద ఆరంభమై.. 20739 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరికి 684 పాయింట్ల లాభంతో 20646 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6044 పాయింట్ల ప్రారంభమై.. ఓ దశలో 6142 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. చివరికి నిన్నటి ముగింపుకు 216 పాయింట్ల వృద్ధితో 6115 పాయింట్ల వద్ద క్లోజైంది.
 
ఇండెక్స్ ఆధారిత కంపెనీ షేర్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 9.36 శాతం, జయప్రకాశ్ అసోసియేట్స్ 8.86 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.81 శాతం, ఎస్ బీఐ 8.01 శాతం, కొటాక్ మహేంద్ర 7.95 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. 
 
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ ను పోల్చితే రూపాయి 156 పైసలు లాభపడి 61.82 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరిన్ని వార్తలు