ఆటో, బ్యాంకింగ్ మద్దతుతో భారీ లాభాలు

3 Oct, 2016 16:11 IST|Sakshi
ఆటో, బ్యాంకింగ్ మద్దతుతో భారీ లాభాలు

ముంబై:  భారీ లాభాలతో అక్టోబర్ మాసానికి  స్టాక్ మార్కెట్లు శుభారంభాన్నిచ్చాయి. రియల్టీ, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్, మీడియా  షేర్ల  ర్యాలీతో  సోమవారం నాటి మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 377  పాయింట్ల లాభంతో 28,243 దగ్గర,  నిఫ్టీ127 పాయింట్ల లాభంతో  8,738 వద్ద స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్ , నిఫ్టీ కీలక మద్దతు  స్తాయిలకు పైన బలంగా ముగియడం విశేషం.  అలాగే మిడ్ క్యాప్ షేర్లు రికార్డు ముగింపును నమోదుచేశాయి. ఆసియా , యూరోప్ మార్కెట్లు సానుకూల సంకేతాలు, ఆర్ బీఐ  పాలసీ సమీక్షలో వడ్డీరేట్ల కోత  అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బాగా బలపడింది. దీంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

దేశ మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)  సర్వే,  సెప్టెంబర్ మాసంలో భారీగా పెరిగిన  మారుతి సుజుకి, మహీంద్ర అండ్ మహీంద్ర , ఐషర్ మోటార్స్ , టాటా మోటార్స్  సంస్థ విక్రయాలు ఆటో షేర్లకు జోష్ పెంచాయి. ఆటోషేర్ల ర్యాలీతో  దలాల్ స్ట్రీట్ ఒక దశలో 400 పాయింట్లపై పైగా లాభపడింది.
అటు కరెన్సీ మార్కెట్లొ దేశీయ కరెన్సీ  బలంగానే కొనసాగుతోంది. 0.14పైసల లాభంతో 66.48వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా.లు రూ.48 లాభంతో రూ. 30,790వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు