భారీ నష్టాల్లో భారత ఈక్వీటీ మార్కెట్లు!

30 Jul, 2013 19:39 IST|Sakshi
భారీ నష్టాల్లో భారత ఈక్వీటీ మార్కెట్లు!
త్రైమాసిక రుణ పరపతి విధానంలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడంతో భారత ఈక్వీటీ  మార్కెట్లు మంగళవారం భారీ నష్గాల్లో ముగిసాయి. 
 
వృద్ది రేటు మందగించవచ్చనే రిజర్వు బ్యాంక్ అంచనాలతో ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా పతనమై సెన్సెక్స్ 245 పాయింట్లు కోల్పోయి 19348 పాయింట్ల వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 5755 వద్ద ముగిసింది. ఆయిల్, గ్యాస్, ఆటో మొబైల్, పీఎస్ యూ, ఎఫ్ ఎమ్ సీజీ రంగాల షేర్లు నష్టాల్లో ముగిసాయి. టెక్నాలజీ రంగం కంపెనీల షేర్లలో కొనుగోళ్లు భారీగా జరిగాయి. 
 
ద్రవ్యోల్పణం గరిష్ట స్థాయి నమోదు చేసుకోవడం, ఇటీవల కాలంలో రూపాయి కనిష్ట స్థాయిని తాకడంతో కీలక వడ్డీ రేట్లలో మార్పుల లేకుండానే పరపతి విధానాన్ని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో జిందాల్ స్టీల్ అత్యధికంగా జిందాల్ స్టీల్, ఐడీఎఫ్ సీ, ఇన్పోసిస్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ కంపెనీలు లాభాలతో ముగిసాయి. 
 
బీపీసీఎల్ 8.55 శాతం , రిలయన్స్ ఇన్ఫ్రా (6.93), రాన్ బాక్సీ (6.44), ఓఎన్ జీసీ (5.68), డీఎల్ ఎఫ్ (5.38 శాతం) కంపెనీలు భారీ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 
 
>
మరిన్ని వార్తలు