మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి

4 Dec, 2013 03:30 IST|Sakshi
మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి

 బీహార్‌లో మావోయిస్టుల ఘాతుకం
 ఔరంగాబాద్/పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. ఔరంగాబాద్ జిల్లాలోని చంద్రాగఢ్ మోరె (సర్కిల్) సమీపంలో తాండ్వా-నబీనగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం పోలీసు జీపును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తాండ్వా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జి అజయ్ కుమార్ సహా ఏడుగురు పోలీసులు మృతిచెందారు. నబీనగర్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో సమావేశానికి హాజరై పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఈ దాడికి తెగబడినట్లు అదనపు డీజీపీ (హెడ్‌క్వార్టర్స్) రవీంద్ర కుమార్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్పెషల్ ఆక్సిలరీ పోలీసు విభాగానికి చెందిన వారితోపాటు జీపు డ్రైవర్ అయిన హోంగార్డు కూడా ఉన్నట్లు చెప్పారు.
 
  పేలుడు అనంతరం ఘటనాస్థలి వద్ద పోలీసులకు చెందిన ఐదు రైఫిళ్లు కనిపించాయన్నారు. మావోయిస్టుల దాడి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్.కె. భరద్వాజ్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. జార్ఖండ్‌లోని పాలము జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఔరంగాబాద్ జిల్లా మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డగా ఉంటోంది.
 
 21 మంది మావోయిస్టుల ఆస్తులు అటాచ్
 దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో 21 మంది మావోయిస్టులకు చెందిన స్థిరచరాస్తులను నితీశ్ సర్కారు మంగళవారం అటాచ్ చేసింది. ఇందుకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు 39 కేసులు సిద్ధం చేయగా ప్రభుత్వం 21 కేసుల్లో అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్‌జీ భార్యకు చెందిన రూ. 25 లక్షల విలువైన స్థలం కూడా ఈ జాబితాలో ఉంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం