ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు?

2 Sep, 2016 12:29 IST|Sakshi
ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు?

రిపబ్లికన్ పార్టీ అమెరికన్ అధ్యక్ష పదవి అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ తరఫున బాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హిందూ అమెరికన్లను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి అభ్యర్థుల మొదటి డిబేట్ కు రెండు రోజుల ముందు న్యూజెర్సీలో ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు సమాచారం.

రిపబ్లికన్ హిందూ సమాఖ్య(ఆర్ హెచ్ సీ) తాము నిర్వహించనున్న ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. షాహిద్ కపూర్, మలైకా అరోరా, అమీషాపటేల్, ప్రభుదేవా, సింగర్ కనికా కపూర్ ఆ ఫోటోలో ఉన్నారు. వీరందరూ టెర్రరిజానికి వ్యతిరేకంగా న్యూజెర్సీలో ఏర్పాటు చేసే షోలో పాల్గొని, ఆ తర్వాత ట్రంప్ ను కలుస్తారని సమాచారం. అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బును టెర్రరిజం బాధితులకు అందజేయనున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా