నల్లధన సమాచారం వెల్లడించండి : సీపీఐ

23 Jun, 2014 07:11 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెల్లడించాలని సీపీఐ డిమాండ్ చేసింది. తమదేశంలో డబ్బు దాచుకున్న వారి వివరాలను స్విట్జర్లాండ్ సిద్ధం చేస్తున్నందున, మిగతా బ్యాంకుల్లో ఖాతాలున్నవారి వివరాలు కూడా భారత్ తెలుసుకోవాలని సీపీఐ సూచించింది. విదేశాల్లో నల్లధనం వెలికితీత కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిచర్యగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినందున , ఆ సమాచారాన్నంతా పార్లమెంట్‌కు, దేశప్రజానీకానికి వెల్లడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా కోరారు.  ఇదిలాఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలన్న పీజే నాయక్ కమిటీ సిఫారసులను తిరస్కరించాలని సీపీఐ జాతీయ సమితి సమావేశం ఆదివారం డిమాండ్ చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టం చేయాల్సిన తరుణంలో ఈ సిఫారసులు పూర్తిగా అభ్యంతరకరమైనవని, ఖండించదగినవని సీపీఐ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీసిన సంగతిని విస్మరించరాదన్నారు.
 

>
మరిన్ని వార్తలు