పదవులకు వయో పరిమితి ఏమిటి?:శత్రుఘ్న సిన్హా

30 May, 2014 19:50 IST|Sakshi
పదవులకు వయో పరిమితి ఏమిటి?:శత్రుఘ్న సిన్హా

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా పదవులు చేపట్టడానికి వయో పరిమితి ఎంతమాత్రం అడ్డురాదని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్ లో పదవులు చేపట్టడానికి 75 వయసుకు లోబడి ఉండాలన్న ప్రధాని మోడీ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శత్రుఘ్న సిన్హా..  తాజాగా ఏర్పడిన నరేంద్ర మోడీ కేబినెట్ లో వయస్సు ను ప్రామాణికంగా నిర్ణయించడం సరైన పద్దతి కాదన్నారు.' మంత్రిగా ఉండటానికి వయసు ప్రామాణికం కాదు. అది సరైన నిర్ణయం కూడా కాదు. వారి మానసిక స్థితి, ఆరోగ్యాన్ని బట్టి పరిగణలోకి తీసుకోవాలని' సిన్హా తెలిపారు. 

 

ఇందుకగాను బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని ఉదహరించారు. ప్రస్తుతం 86 సంవత్సరాల వయసున్న అద్వానీ చురుకైన జ్క్షాపకశక్తిని కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు కూడా ఆయనలో చురుకుదనం 40 సంవత్సరాల వారిని గుర్తుకు తెస్తుందన్నారు. అసలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిల మానసిక స్థిరత్వంపై ఎవరికైనా సందేహాలు ఉంటాయా? అంటూ విలేకర్లును ప్రశ్నించారు. రెండో సారి పంజాబ్ సాహిబ్ నియోజవర్గం గెలిచిన శత్రుఘ్న సిన్హా గత ఎన్డీఏ ప్రభుత్వంలోని వాజ్ పాయ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు