‘ఆ కిరీటం కోసం 4 రోజులు పస్తులున్నా’

26 Jul, 2016 09:28 IST|Sakshi
‘ఆ కిరీటం కోసం 4 రోజులు పస్తులున్నా’

అందాల పోటీలో గెలువడమంటే మాటలు కాదు. అందుకే, ఈ పోటీలో గెలిచేందుకు తాను నాలుగురోజులు కడుపు మాడ్చుకున్నట్టు ప్రకటించి ఓ మోడల్ దుమారం రేపింది. నాటల్య షువాలోవా ఇటీవల రష్యాలో జరిగిన అందాల పోటీలో గెలుపొంది.. ‘సెక్సీయెస్ట్ గర్ల్ ఇన్ రష్యా’గా నిలిచింది. నాలుగు వేల మందితో పోటీపడిన ఆమె ‘మిస్ మాక్సిమ్ 2016’ కిరీటాన్నీ దక్కించుకుంది.

ఈ సందర్భంగా 21 ఏళ్ల విద్యార్థిని, మోడల్ అయిన నాటల్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కొన్ని విస్మయకర విషయాలు తెలిపింది. అందాల పోటీలో గెలిచేందుకు నాలుగు రోజులు అన్నం తినలేదని, అందంగా సన్నగా ఫర్ఫెక్ట్ ఫిగర్‌తో కనిపించేందుకు కడుపుమాడ్చుకున్నానని చెప్పింది. పోటీలో గెలువడంతో ఇప్పుడు ఎంత కావాలంటే అంత తింటానని పేర్కొంది. ఈ ముద్దుగుమ్మ తీరుపై ఆన్‌లైన్‌లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందాల పోటీలో గెలువాలంటే కడుపు మాడ్చుకోవాలనే తప్పుడు సంకేతాల్ని ఆమె ఇస్తున్నదని, కడుపు మాడ్చుకొని అందాల రాణి అనిపించుకోవాల్సిన ఖర్మ ఏం పట్టిందని నెటిజన్లు మండిపడుతున్నారు.


మరిన్ని వార్తలు