మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యం

8 Dec, 2013 10:44 IST|Sakshi

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సమీప ప్రత్యర్థి శశాంక్ భార్గవ కంటే 1168 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విదిశ నియోజకవర్గం నుంచి చౌహాన్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీ122 మంది అభ్యర్థులు విజయం పథంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 52 మంది అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.ఇతర పార్టీలకు చెందిన 12 మంది అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.

 

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపూరి శాసనసభ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన  సింధియా వంశానికి చెందిన కోడలు యశోధర రాజ్ సింధియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జై వర్థన్ సింగ్  రాఘవ్ గడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా  ఆధికంలో కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు