బ్రేకింగ్‌: అమెరికాలో కాల్పుల కలకలం!

29 Mar, 2017 20:20 IST|Sakshi
అమెరికాలో కాల్పుల కలకలం!

వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ బిల్డింగ్‌ సమీపంలో బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. యూఎస్‌ బోటానిక్‌ గార్డెన్‌కు, రేబర్న్‌ హౌస్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌కు చేరువలో అమెరికా పార్లమెంటు భవనం ఉండే క్యాపిటల్‌ ప్రాంతంలో ఈ కాల్పులు జరగడంతో భద్రతా దళాలు వెంటనే అలర్ట్ అయి.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఓ మహిళా అనుమానితురాలు కారులో దూసుకొస్తూ క్యాపిటల్‌ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక దశలో క్యాపిటల్‌ పోలీసులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం. అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారుతో ఢీకొట్టిన ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన ఎలా జరిగింది? దీని వెనుక ఏదైనా దురుద్దేశం ఉందా? అన్నది ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనలో క్యాపిటల్‌ పోలీసులకు తాము సహకారం అందిస్తున్నామని ఎఫ్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
 

మరిన్ని వార్తలు