అమెరికాలో సిక్కు ప్రొఫెసర్పై దాడి

23 Sep, 2013 11:33 IST|Sakshi

అమెరికాలో ఓ సిక్కు ప్రొఫెసర్ను ఉగ్రవాదివని ద్వేషిస్తూ కొందరు దుండగులు దాడి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్, పబ్లిక్ ఎఫైర్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఫ్రభుజ్యోత్ సింగ్ను ఒసామా అని పిలుస్తూ ఆయనపై దౌర్జన్యం చేశారు. శనివారం రాత్రి ఆయన ఓ వీధిలో నడిచి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఈ సంఘటనలో ప్రభుజ్యోత్ తీవ్రంగా గాడపడ్డారు. దుండగులు ఆయన ముఖంపై పిడి గుద్దులు కురిపించడంతో తీవ్రగాయాలయ్యాయి. నోటీ పల్లు కూడా రాలిపోయాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు ప్రభుజ్యోత్ స్నేహితుడు జీత్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లడలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు