పంజాబ్లో టెన్షన్.. టెన్షన్

14 Oct, 2015 12:21 IST|Sakshi
పంజాబ్లో టెన్షన్.. టెన్షన్

ఫరిద్కోట్: పంజాబ్లోని ఫరిద్ కోట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవాన్ని దూషించారటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. వీరిని అడ్డుకుని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకోగా ఘర్షణలు మరింత మించిపోయాయి.

పరస్పర దాడులు జరగడంతో మొత్తం 17మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లాఠీఛార్జి జరపి, భాష్పవాయుగోళాలను, జలఫిరంగులను ప్రయోగించి చివరకు రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నా అక్కడి వాతావరణం మాత్రం గంభీరంగా తయారైంది. ప్రజలంతా శాంతితో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు