ఒక పేజీలో టాక్స్‌ ఫైలింగ్‌ ఎలా?

1 Apr, 2017 09:29 IST|Sakshi
ఒక పేజీలో టాక్స్‌ ఫైలింగ్‌ ఎలా?

ఒకపుడు ఆదాయ పన్ను దాఖలు చేసే పద్ధతి చాలాకష్టంగా ఉండేది. సామాన్య మానవుడికి మరీ  కష్టంతో కూడుకున్న పని.  పన్ను  రిటర్న్స్ దాఖలులో ఈ-ఫైలింగ్‌ ఈ ప్రక్రియ కొంత సులభమైందనే చెప్పాలి. తాజాగా ప్రవేశపె‍ట్టిన  ఒక పేజీలో వ్యక్తిగతంగా ఆదాయం పన్ను దాఖలు చేసే పద్ధతి మరింత సులభం. మొదట14 పేజీలుగా ఈ ఫైలింగ్‌ విధానాన్ని మార్చి గతంలో మూడు పేజీలకు తగ్గించారు.  ఇక ఇప్పటినుంచి ఆన్‌లైన్‌లో టాక్స్ ఫైలింగ్‌ చేసేవారు కేవలం ఒక పేజీలో వివరాలు పూర్తి చేస్తే చాలు.  వారి పాన్‌కార్డు నంబర్‌, వ్యక్తిగత వివరాలు, పన్నుల చెల్లింపు వివరాలు తెలిపితే సరిపోతుంది. మిగితా సమాచారం తనంతట తానే ఆటోమేటిక్ గా సాఫ్ట్‌వేర్‌ సమకూర్చుకుంటుంది. ఏప్రిల్ 1,2017, ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ముఖ్యంగా సాలరీడ్‌ వ్యక్తులకు గణనీయంగా సులభతరమైంది.

ఐటిఆర్  ఫాం నింపేందుకు సింపుల్‌ స్టెప్స్‌ ఇపుడు చూద్దాం.
1) ఐటి శాఖ పన్ను దాఖలు వెబ్ సైట్ లో  ముందుగా రిజిస్టర్ కావాలి.
2) మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్ను పూరించాలి.  తాజా    నిబంధనల ప్రకారం  ఆధార్  నెంబరు  దాఖలు తప్పనిసరి.
3) మీ వ్యక్తిగత వివరాలు మరియు పన్నులు చెల్లించిన సమాచారాన్ని పూరిస్తే..టీడీఎస్‌(టాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) వివరాలు ఆటోమేటిగ్గా  పూర్తవుతాయి.
4) దీంట్లో రెండు మార్గాలు  ఉన్నాయి. వివరాలు పూరించి ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు  లేదా సాఫ్ట్ కాపీని డౌన్లోడ్  చేసుకొని వివరాలు నింపి ఆఫ్‌లైన్‌లో సబ్మిట్‌ చేయొచ్చు.
5)  ఒకవేళ ఆఫ్‌లైన్‌ లో అయితే  సంబంధిత  ఐటి  రిటర్న్స్‌కు కావాల్సిన పత్రాల ఎక్స్‌ఎంఎల్‌  వెర్షన్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయాలి.
6) ఈ మొత్తం ప్రక్రియ  పూర్తి చేసిన తర్వాత,  ఐటి ఫైలింగ్‌ ను నిర్ధారిస్తూ ఒక మెసేజ్‌ వస్తుంది.  
 

మరిన్ని వార్తలు