భార్యాభర్తలిద్దరూ జర్నలిస్టులే..

19 Apr, 2015 17:35 IST|Sakshi
భార్యాభర్తలిద్దరూ జర్నలిస్టులే..

విశాఖపట్టణం: ఏచూరిమంచి రచయితగా కూడా పేరుంది. ఉత్తర భారతంలో పేరున్న హిందూస్తాన్ టైమ్స్ పత్రికలో కాలమిస్టుగా అనేక వ్యాసాలు రాశారు. ఆయన భార్య సీమా శిస్తీ కూడా జర్నలిస్టే. బీబీసీ హిందీ విభాగానికి ఢిల్లీలో సంపాదకురాలిగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్ల పత్రికకు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి. తొలి భార్యకు  ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మోహన్ కందా ఆయన మేనమామ.

మంచి పార్లమెంటేరియన్ కూడా...
పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగకుండా తరచూ అడ్డం పడుతుంటారన్న విమర్శ ఉన్నప్పటికీ కార్మిక వర్గ ప్రయోజనాల కోసమేనని చెబుతుంటారు.

మంచి రచయిత కూడా..
దాదాపు 20 పుస్తకాలు రాశారు. వీటిల్లో ఆర్ధిక శాస్త్రం మొదలు రాజకీయ అంశాల వరకు ఉన్నాయి. చాలా దేశాలలో విస్తృతంగా పర్యటించారు.

మరిన్ని వార్తలు