మీ ముక్కు సైజును నిర్ణయించేది ఇదే!!

17 Mar, 2017 23:22 IST|Sakshi
మీ ముక్కు సైజును నిర్ణయించేది ఇదే!!

న్యూయార్క్‌: అప్పుడే పుట్టిన పిల్లల్లో పోలికలను పరిశీలించేటప్పుడు ముందుగా పరిశీలించేది ముక్కునే. ఆ ముక్కును చూసే తండ్రిలా ఉన్నాడు.. తల్లిలా ఉన్నాడు.. అచ్చం తాతయ్య పోలికలే.. అని చెబుతుంటారు. అయితే ముక్కు పరిమాణాన్ని, ఆకారాన్ని నిర్ణయించేవి వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కావని, స్థానిక వాతావరణ పరిస్థితులే మన ముక్కు పరిమాణం, ఆకారాన్ని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం తెలిసింది.

స్థానిక వాతావరణంలోని గాలిలో నీటి ఆవిరి, ఉష్ణోగ్రత వంటివి ముక్కు పరిమాణాన్ని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, గాలిలో నీటిఆవిరి పరిమాణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారి ముక్కు కాస్త వెడల్పుగా ఉంటుందని, ఆర్ధ్రత తక్కువగా ఉండి, శీతల ప్రాంతాల్లో నివసించేవారి ముక్కు వెడల్పు తక్కువగా ఉండి, పొడవుగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవపరిణామక్రమంలో వచ్చిన మార్పు కారణంగానే ఇలా ఆకారాలు, పరిమాణాల్లో మార్పులు సంభవిస్తున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు