జేబులో పట్టే కొత్త రోబో ఫోన్...

13 Oct, 2015 19:41 IST|Sakshi
జేబులో పట్టే కొత్త రోబో ఫోన్...

టోక్యో...  జపాన్కు చెందిన బహుళ జాతి సంస్థ 'షార్ప్'  ఇప్పుడు మీ జేబులో చక్కగా ఇమిడిపోయే కొత్త రోబో ఫోన్ను అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోట్ ఫోన్ను ఈ సంస్థ  పరిచయం చేస్తోంది. రోబోహోన్ పేరిట రానున్న ఈ స్మార్ట్ ఫోన్...  అన్ని ఎండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలాగే కాల్స్ మాట్లాడేందుకు, ఫోటోలు తీసేందుకు, మ్యాప్లు చూపించేందుకు ఉపయోగపడుతుంది. దీనితోపాటు..  డ్యాన్స్ చేయడం కూడా ఈ ఫోన్లో ప్రత్యేకత. చిన్నపాటి టచ్ స్క్రీన్ ఉండే ఈ బుజ్జి రోబో ఫోన్లో ఒక్కో స్క్రీన్ మీద కేవలం నాలుగు ఐకాన్లు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.

ప్రసిద్ధ టోక్యో ప్రొఫెసర్.. అండ్ రోబోటిసిస్ట్.. టొమోటకా తకహాషి అభివృద్ధి పరచిన ఈ కొత్త పరికరాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. రోబోహోన్ ప్రయోగం ద్వారా  ప్రాథమికంగా ఈ ఫోన్.. మాట్లాడే సౌకర్యం కలిగి ఉంటుంది. టచ్ స్క్రీన్ లో మరోభాగం ఇంటర్నెట్. ఫోన్ వెనుక భాగంలో రెండు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది.

ముఖం భాగంలో లోపల కెమెరా, ప్రొజెక్టర్ అమర్చారు. ఈ ఫోన్కు అదనంగా కనిపించే రోబోట్ చేతులు, కాళ్ళు అది నడిచేందుకు వీలుగా ఉంటాయి. అయితే ఈ ఫోన్ మీరు కోరితే డాన్స్ కూడా చేస్తుంది. ఫోన్లో టెక్స్ట్ సందేశాలతో పాటు... ప్రొజెక్టర్ ఆధారంగా  ప్రాజెక్ట్ ఫొటోలు, వీడియోటెక్స్ కనిపించే అవకాశం ఉంది. ఓ బొమ్మను నిలబెట్టినట్లే ఈ ఫోన్ను ఎక్కడైనా నిలబెట్టి ఫోటోలు తీయొచ్చు. యూజర్ వాయిస్ను, ముఖాన్ని గుర్తించగలిగే సామర్థ్యం కూడ ఈ ఫోన్కు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ కొత్త ఫోన్ ధర వివరాలు మాత్రం కంపెనీ ఇంకా బయట పెట్టలేదు.

మరిన్ని వార్తలు