స్మార్ట్‌ ఫోన్లతో చిన్నారుల్లో కంటి సమస్యలు

10 Jan, 2017 09:29 IST|Sakshi

సియోల్‌: స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కు వగా ఉపయోగించే చిన్నారులకు కళ్లు పొడి బారతాయని తాజా అధ్యయనంలో తేలింది. దక్షిణ కొరియాలోని చుంగ్‌ ఆంగ్‌ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వ హించారు. దీని కోసం 916మంది చిన్నారులను పరీక్షించారు. స్మార్ట్‌ ఫోన్ల స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల పిల్లల్లో కళ్లు పొడిబారుతున్నట్లు (డీఈడీ వ్యాధి) గుర్తించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారు లతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. బయట ఆటలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ద్వారా దీని బారి నుంచి బయటపడగలరన్నారు. పట్టణాల్లోని చిన్నారుల్లో 8.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో 2.8 శాతం మంది డీఈడీ బారిన పడినట్లు గుర్తించారు.

>
మరిన్ని వార్తలు