ఇక సోలార్ పవర్‌పై పెట్రోల్ బంకులు

25 Aug, 2015 18:30 IST|Sakshi
ఇక సోలార్ పవర్‌పై పెట్రోల్ బంకులు

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు రెండువేల పెట్రోలు, డీజిల్ బంకులు ఈ ఏడాది చివరికల్లా సోలార్ పవర్‌పై నడిచే బంకులుగా మారిపోనున్నాయి. దీనివల్ల ఒక్కో బంకు డీలర్‌కు నెలకు దాదాపు 20వేల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. విద్యుత్ కొరత ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని 2,150 బంకులను ముందుగా సోలార్ పవర్ బంకులుగా మార్చనున్నారు. ఈ దిశగా కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి సంస్థలు సోలార్ పవర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి లక్షన్నర రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు కానున్నది. ఆ మొత్తంలో కేంద్రం సబ్సిడీ కింద 40 శాతం ఖర్చును భరిస్తుంది. ఒక కిలోవాట్ నుంచి 25 కిలోవాట్స్ వరకు సోలార్ విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం.

మరిన్ని వార్తలు