మద్యానికి డబ్బులివ్వలేదని తండ్రి హత్య

14 Sep, 2013 21:23 IST|Sakshi

మద్యం కొనుగోలుకు డబ్బులివ్వలేదనే కోపంతో 65 ఏళ్ల తండ్రిని తనయుడు హత్య చేశాడు. ఈ ఘటన ఔటర్ ఢిల్లీలోని కాంఝావాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. సత్యకృష్ణ అనే వ్యక్తి తన కుమారుడు కృష్ణన్, భార్య గాయత్రిలతో కలిసి నగరంలోని కాంఝావాలా ప్రాంతంలో నివసిస్తున్నాడు. నిరుద్యోగి అయిన కృష్ణన్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం కొనుగోలుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ కృష్ణన్.. తన తండ్రితో ఘర్షణకు దిగేవాడు.

ఇదే విషయమై అడగ్గా తండ్రి సత్యప్రకాశ్ కుమారుడిని తిట్టాడు. ఉద్యోగం లేకపోగా మద్యానికి బానిసవుతావా అంటూ మందలించాడు. దీంతో కోపం పట్టలేకపోయిన కృష్ణన్... పారతో తండ్రి తలపై మోదాడు. గట్టి శబ్దం వినపడడంతో గాయత్రి బయటికొచ్చి చూడగా సత్యకృష్ణన్ రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గాయత్రి గట్టిగా  కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పారను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. కేసు విచారణలో ఉంది.

మరిన్ని వార్తలు