రక్త పరీక్షతోనే కేన్సర్‌ నిర్ధారణ

23 Mar, 2017 08:07 IST|Sakshi

వాషింగ్టన్‌: సాధారణ రక్త పరీక్షతోనే ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌ మహమ్మారిని నిర్ధారించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడున్న కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ పద్ధతులు చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నవని, త్వరలో అందుబాటులోకి రానున్న ఈ నూతన పద్ధతిలో కేన్సర్‌ నిర్ధారణ ఇకపై సులభతరం కానుందని పరిశోధకులు వెల్లడించారు.

ఈ పద్ధతి ప్రకారం ఓ వ్యక్తి రక్తంలోని ప్లాస్మాలో ఫాస్పోప్రోటీన్ల శాతం పెరగడం అతనికి కేన్సర్‌ వ్యాధి ఉన్నట్లు సూచిస్తుందని అమెరికాలోని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉన్నవారి నుంచి రక్త నమూనాలు సేకరించామని, అలాగే ఈ పద్ధతిలో ఇతర కేన్సర్‌ల గుర్తింపుతోపాటు ఇతర రోగాలను నిర్ధారించుకోవచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు