ఉగ్రవాదంతో దక్షిణాసియాకు సవాళ్లు!

20 Sep, 2014 18:54 IST|Sakshi

కఠ్మాండు: అఫ్ఘానిస్థాన్ నుంచి విదేశీ బలగాలు వైదొలగిన తర్వాత దక్షిణాసియాకు ఉగ్రవాదులనుంచి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ఉగ్రవాదుల బెడదను అరికట్టేందుకు కొత్త వ్యూహాలు రూపొందించుకోవలసిదిగా దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సభ్య దేశాలకు సూచించింది. నేపాల్ రాజ ధాని కఠ్మాండులో శుక్రవారం సార్క్ అంతర్గత వ్యవహారాల, హోం మంత్రుల ఆరవ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అప్ఘానిస్థాన్‌నుంచి విదేశీ సేనలు వైదొలగడంతో దక్షిణాసియాకు ఎదురయ్యే ఉగ్రవాదం బెడదను దక్షిణాసియా దేశాలు జాగ్రత్తగా అంచనా  వేయాలన్నారు.

 

ఉగ్రవాదాన్ని, హింసాకాండను రెచ్చగొట్టే వ్యక్తులు, సంస్థలు, ప్రచురణల విషయంలో కఠినమైన శిక్షలు విధించేందుకు అనుగుణంగా దక్షిణాసియా దేశాలన్నీ తగిన చట్టాలు చేయాలన్నారు.  ప్రజల సంక్షేమంకోసం కలసికట్టుగా పనిచేయడమే తొలి ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని, హిమాలయాల్లోని రెండు పొరుగుదేశాల్లో ఆయన తొలిపర్యటన జరిపారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

మరిన్ని వార్తలు