రెండ్రోజుల ముందే పండుగ..

30 May, 2017 15:22 IST|Sakshi
రెండ్రోజుల ముందే పండుగ..

- కేరళ, ఈశాన్య భారతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
- సాధారణం కంటే రెండు రోజుల ముందే రాక


న్యూఢిల్లీ:
భారత వ్యవసాయరంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. అండమాన్‌ దీవుల మీదుగా ప్రయాణించిన రుతుపవనాలు మంగళవారం ఉదయం ఇటు దక్షిణ కేరళ, అటు ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి, వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా జూన్‌1న నైరుతి రుతుపవనాలు కేరళలను తాకుతాయి. అందుకు భిన్నంగా ఈ సారి రెండురోజుల ముందే ఆగమనం చేశాయి.

జూన్‌ మొదటివారంలో తెలంగాణ, ఏపీలకు
మంగళవారం భారత్‌లోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ జూన్‌ మొదటివారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను తాకనున్నాయి. దీంతో రైతులు వ్యవసాయపనులను వేగవంతం చేశారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు