భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా

10 Sep, 2016 17:14 IST|Sakshi
భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా

భూమిని ఏదో ఒకరోజు ఢీ కొట్టే అవకాశం ఉన్న ఓ ఉల్కను నాసా పేల్చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రోబోటిక్ హంటర్ ను కార్నివల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించింది. ఈ ఉల్క పేరును బెన్నుగా తెలిపిన నాసా.. ముక్కలైన బెన్నుపై జీవిజాడల కోసం అన్వేషణ చేపట్టినట్లు తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి బెన్ను భూమికి చేరువగా వస్తుందని పేర్కొంది.

ఈ ప్రక్రియలో వచ్చే 150 ఏళ్లలో బెన్ను భూమికి అతి చేరువగా వచ్చి ఢీ కొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగానే ఒసిరిస్-రెక్స్ అంతరిక్ష నౌకని ప్రయోగించి ఉల్కను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బెన్ను భూమిని ఢీ కొట్టకపోయినా.. మానవజాతికి హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. బెన్నుతో పాటు పెద్ద సంఖ్యలో ఉల్కలు భూమికి చేరువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బెన్నుని ధ్వంసం చేయడం వల్ల వాటిపై కూడా పరిశోధనలు చేసే అవకాశం ఏర్పడిందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు