ప్రత్యేక అలంకరణలో శ్రీవారి ఆలయం

1 Jan, 2016 05:23 IST|Sakshi
ప్రత్యేక అలంకరణలో శ్రీవారి ఆలయం

నూతన సంవత్సరానికి భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ
సాక్షి, తిరుమల: నూతన సంవత్సరానికి తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోనూ అదనపు క్యూలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు వీఐపీ దర్శనం ప్రారంభించనున్నారు. అందరికీ లఘుదర్శనం అమలు చేయాలని నిర్ణయించారు.

గంటలోపే వీఐపీలకు దర్శనం పూర్తిచేసి, తర్వాత సర్వదర్శనం, కాలిబాట భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రూ.300 టికెట్ల భక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు.
 
దర్శనానికి అనుమతించలేదని భక్తుల ఆందోళన
సాక్షి , తిరుమల: శ్రీవారి దర్శనానికి అనుమతించలేదని టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చిన భక్తులు గురువారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. నూతన సంవత్సరం సంద ర్భంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ఈ సమాచారాన్ని టీటీడీ వెబ్‌సైట్, ఈ-మెయిల్ ద్వారా భక్తులకు చేరవేశారు. అయితే గురువారం 50 మందికిపైగా విరాళాలిచ్చిన భక్తులను దర్శనానికి అను మతించలేదు.

 తాము రూ.30 లక్షల వరకు టీటీడీకి విరాళాలిచ్చామని, ముందస్తు సమాచారం లేకుం డా దర్శనానికి అనుమతించకపోవడం సబబుకాదని ఆందోళనకు దిగారు. అనంతరం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశాలతో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆ భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు.

మరిన్ని వార్తలు