స్టేటస్‌ ఫైట్‌: వైజాగ్‌కు చేరుకున్న హీరో!

26 Jan, 2017 10:28 IST|Sakshi
స్టేటస్‌ ఫైట్‌: వైజాగ్‌కు చేరుకున్న హీరో!

వైజాగ్‌: ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటుతూ వైజాగ్‌ కేంద్రంగా ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా.. వాటన్నింటినీ ఛేదించుకొని యువత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు వైజాగ్‌ చేరుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న మౌనపోరాట దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన యువతను, ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ పిలుపుమేరకు ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన యువతను, విద్యార్థులను పోలీసులు చెదరగొడుతున్నారు. శాంతియుతంగా, సయమనంగా మౌనదీక్షలో పాల్గొంటున్న విద్యార్థులను రెచ్చగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ఆందోళనకు మద్దతుగా ప్రముఖ హీరో సంపూర్ణేష్‌ బాబు వైజాగ్‌ చేరుకున్నారు. హోదా ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించిన సంపూర్ణేష్‌ బాబు.. ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు గురువారం వైజాగ్‌ వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆర్కే బీచ్‌లో నిర్వహించే ప్రత్యేక హోదా నిరసనలో తాను పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు