‘ఓటర్ల నమోదుకు మరో చాన్స్’

3 Mar, 2014 04:36 IST|Sakshi

నోయిడా: ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని పౌరులు వాటిని నమోదు చేసుకునేందుకు లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా మరో అవకాశం కల్పించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్. సంపత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సవరించిన ఓటర్ల జాబితాలో పేర్లులేని వ్యక్తులు కొత్తగా పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆదివారం నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పా రు.

 

ఇందుకోసం దేశవ్యాప్తంగా 9 లక్షల పోలింగ్ కేంద్రాల్లోని బూత్‌స్థాయి అధికారులు ఫారం-6 జారీ చేసి, పూరించిన ఫారాలను స్వీకరిస్తారని వివరించారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నాం కాబట్టి కలకాలం ఆ పేర్లు ఉంటాయని అనుకోవద్దని, సిబ్బంది తప్పులు, పొరబాట్ల కారణంగా తాము ఏటా విడుదల చేసే సవరించిన ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఓటర్లు సవరించిన ఓటర్ల జాబితాను తరచూ చూసుకోవాలని...ఒకవేళ పేర్లు గల్లంతైతే కొత్తగా నమోదు చేసుకోవాలన్నారు.
 

>
మరిన్ని వార్తలు