నీటిలో చేపలా..

13 Feb, 2014 03:04 IST|Sakshi
నీటిలో చేపలా..

చేపలా సముద్రంలో ఈదులాడాలని ఉందా? డాల్ఫిన్‌లా ఇలా దూకాలని ఉందా? మీలాంటి వారి కోసమే ఈ మర చేప. చూడ్డానికి షార్క్‌లా  కనిపిస్తున్నా వాస్తవానికిదో స్పీడ్ బోట్. పాత యుద్ధవిమానాల తాలూకు పరికరాలతో దీన్ని తయారుచేశారు. సీబ్రీచర్‌గా పిలుస్తున్న దీన్ని ఇన్నెస్పేస్ అనే సంస్థ తయారుచేసింది. 260 హార్స్‌పవర్ ఇంజిన్‌తో గంటకు 50 మైళ్ల వేగంతో దూసుకుపోయే ఈ స్పీడ్ బోట్ ధర రూ.41 లక్షలు. దీన్ని  సీబ్రీచర్.కామ్ అనే ఆన్‌లైన్ సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వార్తలు