మా అమ్మాయికి పెళ్లి చేయాలని ఉంది

20 Jun, 2017 23:32 IST|Sakshi
మా అమ్మాయికి పెళ్లి చేయాలని ఉంది

ఒక భారతీయ మహిళ తన కూతుళ్లును ఎలా చూడాలనుకుంటుంది? చక్కగా పెళ్లి చేసుకుని, పిల్లా పాపలతో హాయిగా కాపురం చేసుకుంటుంటేæ చూడాలనుకుంటుంది. అది స్టార్‌ అయినా.. నాన్‌ స్టార్‌ అయినా. అఫ్‌కోర్స్‌ కొంతమంది దీనికి డిఫరెంట్‌గా ఆలోచిస్తారనుకోండి. వాళ్ల గురించి వదిలేద్దాం. పైన చెప్పిన కేటగిరీలో స్టార్‌ యాక్ట్రెస్‌ శ్రీదేవి ఉన్నారు. త్వరలో నటిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఆమె తన కుమార్తెను మాత్రం నటిగా చూడాలనుకోవడంలేదట. ఆ విషయం గురించి శ్రీదేవి మాట్లాడుతూ – ‘‘నా పెద్ద కూతురు జాన్వీ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రం ద్వారా హీరోయిన్‌ కావాలనుకుంది.

ఆ విషయం గురించి తను చెప్పగానే నేను ఆలోచనలో పడ్డాను. ఒక తల్లిగా మాత్రం జాన్వీని యాక్టర్‌గా చూడటం కన్నా పెళ్లి చేసుకుని సెటిల్‌ కావడాన్ని చూడటంలోనే నాకు సంతోషం ఉంటుంది. సినిమా పరిశ్రమ చెడ్డదని కాదు. నన్ను పెంచిందే ఈ పరిశ్రమ. అయితే ఓ తల్లిగా నా కూతురి మ్యారీడ్‌ లైఫ్‌ చూడాలనుకుంటున్నా. కానీ, జాన్వీ ఇష్టాన్ని కూడా కాదనలేను. ఒకవేళ తను ఆర్టిస్ట్‌ అయ్యి, స్టార్‌గా ఎదిగితే నాకు గర్వంగా, ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. సో.. జాన్వీ హీరోయిన్‌ కావడం ఖాయం అనమాట.

మరిన్ని వార్తలు